News June 5, 2024
నెల్లిమర్ల నుంచి మొదటి మహిళా ఎమ్మెల్యే

నెల్లిమర్ల నియోజకవర్గం 2007-08 పునర్‌వ్యవస్థీకరణలో ఏర్పడింది. 2009,19లలో బడ్డుకొండ అప్పలనాయుడు, 2014లో పతివాడ నారాయణస్వామి గెలిచారు. దీంతో నెల్లిమర్ల నుంచి మూడు సార్లు పురుషులే ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2024లో జనసేన అభ్యర్థి మాధవి 39వేల పైచిలుకు మెజార్టీతో గెలిచి నెల్లిమర్ల మొదటి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.
Similar News
News February 12, 2025
VZM: జిల్లా ఎస్పీను సన్మానించిన పోలీస్ అధికారులు

విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్‌ను పోలీస్ అధికారులు మంగళవారం ఘనంగా సన్మానించారు. రాష్ట్రంలోనే అత్యధిక కేసులను జాతీయ లోక్ అదాలత్‌లో డిస్పోజ్ చేయుటలోను, బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డును ఇటీవల పొందారు. దీంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్‌ను పోలీసు అధికారులు ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
News February 11, 2025
పోక్సో కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష: SP

పూసపాటిరేగ పోలీస్ స్టేషన్‌లో 2024లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి రూ.3 వేల జరిమానా, ఏడేళ్ల కఠిన కారాగార శిక్షను జిల్లా కోర్టు ఖరారు చేసిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. పెద్ద పతివాడకు చెందిన హరీష్ ఐదేళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టామని.. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష పడిందన్నారు.
News February 10, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి నామినేషన్లు వేసింది వీరే

➤ పాకలపాటి రఘువర్మ
➤ గాదె శ్రీనివాసులు నాయుడు
➤ కోరెడ్ల విజయ గౌరీ
➤ కోసూరు రాధాకృష్ణ
➤ సత్తలూరి శ్రీరంగ పద్మావతి
➤ నూకల సూర్యప్రకాశ్
➤ రాయల సత్యనారాయణ
➤ పోతల దుర్గారావు
➤ పెదపెంకి శివప్రసాద్
➤ సుంకర శ్రీనివాసరావు
NOTE: నేటితో నామినేషన్లకు గడువు ముగిసింది.