News April 19, 2024
నెల్లిమర్ల: బడ్డుకొండ సంపద రూ.11.25 కోట్లు
నెల్లిమర్ల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఆయన భార్య పద్మావతితో కలిపి స్థిర, చరాస్తుల విలువ రూ.11,25,32,036 గా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈయనకు వివిధ వ్యాపారాలపై 2022-23లో రూ.4,37,980, ఆయన భార్యకు రూ.6,09,320 వచ్చింది.
Similar News
News September 12, 2024
తిరుపతి, శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు
తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి నవంబర్ 10 వరకు ప్రతి ఆదివారం తిరుపతి-శ్రీకాకుళం రోడ్డు ప్రత్యేక రైలు తిరుపతిలో సాయంత్రం 5గంటలకు బయలుదేరి మరుసటి రోజు 10.47కు శ్రీకాకుళం చేరుకుంటుందన్నారు. శ్రీకాకుళం రోడ్డు నుంచి తిరుపతికి అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు.
News September 12, 2024
మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్ అయ్యింది. మెంటాడ పర్యటనకు వెళుతుండగా రామభద్రపురం మండలం బూసాయవలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని మరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News September 12, 2024
‘ఉలిపిరి హెచ్ఎంపై పోక్సో కేసు పెట్టాలి’
ఉలిపిరి హెచ్ఎంపై పోక్సో కేసు పెట్టాలని పార్వతీపురం ఎస్ఎఫ్ఐ గిరిజన విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి డి.పండు డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. హెచ్ఎం కృష్ణారావు విద్యార్థులపై, ఉపాధ్యాయుల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కురుకుట్టిలో పని చేసినప్పుడు ఇదే తంతు జరిగిందన్నారు. ఘటనపై విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేయాలన్నారు.