News September 24, 2024
నెల్లిమర్ల మద్యం గోడౌన్ వద్ద వైన్ షాప్ ఉద్యోగుల ఆందోళన

జిల్లావ్యాప్తంగా వైన్ షాపుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు స్థానిక ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ గోడౌన్ వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అసిస్టెంట్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్సయిజ్ సీఐ శ్రీనివాస్, నెల్లిమర్ల ఎస్సై గణేష్, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
Similar News
News November 5, 2025
జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరగాలి: JC

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్ అధికారులను ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో జేసీ మాట్లాడారు. ధాన్యం సేకరణ సక్రమంగా జరిగేలా ఆర్డీవోలు, తహశీల్దార్లు జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. తదుపరి మండల, గ్రామ స్థాయిలో కూడా వెంటనే శిక్షణ జరపాలని ఆదేశించారు.
News November 5, 2025
ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమోరాలు తప్పనిసరి: కలెక్టర్

ప్రైవేటు దేవాలయాల్లో రోజులో కనీసం వెయ్యిమంది భక్తులు హాజరయ్యే దేవాలయాల వద్ద CC కెమెరాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల అధికారులతో ఆలయాల భద్రతపై బుధవారం సమీక్ష జరిపారు. ఆయా మండలాల్లో ప్రైవేట్ ఆలయాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. కెమెరాల ఏర్పాటును దేవాదాయ శాఖ, రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
News November 5, 2025
బాడంగి: వేగావతి నదిలో కొట్టుకుపోయిన మహిళ మృతి

బాడంగి మండలంలో మహిళ నదిలో కొట్టుకుపోయి మృతి చెందింది. ఆనవరం గ్రామానికి చెందిన అంపవల్లి సంతు (31) కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజంతా ఉపవాసం ఉంది. సాయంత్రం వేగావతి నదిలో స్నానానికి దిగింది. నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయి కారాడ దగ్గర తేలింది. ప్రాణాలతో ఉండటంతో చికిత్స నిమిత్తం బంధువులు బాడంగి CHCకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.


