News October 30, 2024
నెల్లిమర్ల: EVM గోదాములను పరిశీలించిన కలెక్టర్
నెల్లిమర్లలోని EVM గోదాములను కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం తనిఖీ చేశారు. గోదాములకు వేసిన సీళ్లను పరిశీలించిన ఆయన EVMల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీల్లో డీఆర్వో ఎస్.శ్రీనివాస మూర్తి, ఆర్డీవో డీ.కీర్తి, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్రావు, నెల్లిమర్ల ఎమ్మార్వో సుదర్శన్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 31, 2024
VZM: సీఎం సభావేదిక ఫిక్స్..
నవంబర్ 2న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో పర్యటించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో గంగచోళ్ల పెంట వద్ద హెలిప్యాడ్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పురిటిపెంట వద్ద రోడ్డుపై పడ్డ గుంతలను పూడ్చే పనుల్లో ఆయన స్వయంగా పాల్గొననున్నట్లు వివరాలు వెల్లడించారు.
News October 31, 2024
విశాఖలో గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అమెరికాలోని గూగుల్ హెడ్క్వార్టర్స్ను సందర్శించారు. విశాఖలో గూగుల్ క్లౌడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ క్లౌడ్ సీఈవో, వైస్ప్రెసిడెంట్ను కోరారు. ఏపీలో ఈ- గవర్నెన్స్, డిజిటల్ విద్యకు సహకరించాలని మీటింగ్లో ప్రతిపాదించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి తోడ్పాటుతో పాటు స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు సహకరించాలని మంత్రి లోకేశ్ కోరినట్లు టీడీపీ ట్వీట్ చేసింది.
News October 31, 2024
సింహాచలం ఆలయంలో నేడు నరకాసుర వధ
నరక చతుర్దశి సందర్భంగా గురువారం సింహాచలం ఆలయ ప్రాంగణంలో నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పూర్తి చేశారు. నరకాసురుడి విగ్రహాన్ని ఒక పల్లకిలోను సింహాద్రి అప్పన్న, శ్రీదేవి, భూదేవి సమేతంగా మరొక వాహనంలోను ఎదురెదురుగా తీసుకువచ్చి నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు. స్వామివారి దర్శనాలు సాయంత్రం 5 గంటల వరకే లభిస్తాయి.