News November 29, 2024
నెల్లూరుకు చేరుకున్న NDRF బృందాలు

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో ముందస్తుగా NDRF బృందాలు నెల్లూరుకు చేరుకున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
Similar News
News October 30, 2025
నెల్లూరు: ఒక్కో హెక్టార్‌కు రూ.25వేల పరిహారం

తుపాను ధాటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 42 హెక్టార్లలో ఉద్యానపంటలకు నష్టం వాటిల్లిందని ఆ శాఖ జిల్లా అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ప్రాథమిక అంచనాలు రూపొందించినట్లు చెప్పారు. దెబ్బతిన్న కూరగాయలు, బొప్పాయి పంటలకు హెక్టారుకు రూ.25 వేలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్లు చెప్పారు. పూర్తిస్థాయిలో పరిశీలించి ఫైనల్ రిపోర్టును ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.
News October 30, 2025
నెల్లూరు: హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు

నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు బెడ్ షీట్లు వచ్చాయి. 3,585 కార్పెట్లు, 3,854 బెడ్ షీట్స్ సరఫరా చేసినట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ& సాధికారత అధికారిణి పి.వెంకటలక్ష్మమ్మ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 43 బీసీ హాస్టళ్లకు వీటిని పంపిణీ చేసినట్లు చెప్పారు.
News October 29, 2025
వరద బాధితులకు మెరుగైన వైద్య సేవలు: DMHO

ఇందుకూరుపేట మండలం లేబూరు బిట్-1లో ఏర్పాటుచేసిన తుఫాన్ పునరావాస కేంద్రాన్ని DMHO సుజాత పరిశీలించారు. శిబిరంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. సైక్లోన్ అనంతరం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. అనంతరం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మందులు, రికార్డులు పరిశీలించారు. సర్పంచ్ వరిగొండ సుమతి, మెడికల్ ఆఫీసర్ బ్రహ్మేశ్వర నాయుడు పాల్గొన్నారు.


