News September 9, 2024
నెల్లూరులో అండర్ -14 క్రికెట్ జట్టు ఎంపిక
నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా అండర్ – 14 క్రికెట్ జట్లను ఈ నెల 15న ఎంపిక చేయనున్నామని క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నిఖిలేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు తమ సొంత క్రికెట్ కిట్, డ్రస్ కోడ్, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరుకావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News October 15, 2024
నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
అల్పపీడనం, తుఫాను కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఉందని అధికారులు తెలిపారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లను విడుదల చేశారు. 0861-2331261,7995576699 , జిల్లాలోని ప్రజలు ఈ నెంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చున్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 14, 2024
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు
భారీ వర్షాల దృష్ట్యా మంగళవారం కూడా నెల్లూరు జిల్లాలో పాఠశాలలకు, అంగన్వాడీలకు, జూనియర్ కాలేజీలకు సెలవు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. మరో మూడు రోజులు తుఫాన్ ప్రభావం అధికంగా ఉండటంతో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెలవును ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, అందుకు తగ్గట్టు అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు.
News October 14, 2024
ప్రశాంతంగా ముగిసిన మద్యం షాపుల లక్కీ డ్రా ప్రక్రియ
జిల్లావ్యాప్తంగా మద్యం షాపులు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి లక్కీ డ్రా ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. రెండు టేబుళ్లను ఏర్పాటుచేసి ఒక్కొక్క టేబుల్ వద్ద ఇద్దరు వీడియో గ్రాఫర్లతో పూర్తి ప్రక్రియను వీడియోగ్రఫీ చిత్రీకరించినట్లు చెప్పారు. ఆయా షాపులకు టెండర్లు దాఖలు చేసిన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీడిప్ తీసి షాపు దక్కించుకున్న వారి పేరును ప్రకటించారు.