News October 17, 2025

నెల్లూరులో ఆక్రమణలపై కొరడా..!

image

ఇటీవల NMC అధికారులు రోడ్డు మార్జిన్లపై కొరాడ జలిపిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో సైడు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధాన ట్రంకురోడ్డు, పొదలకూరు రోడ్డు, రంగనాయకులపేట, సంతపేట, గాంధీ బొమ్మ, కనకమహాల్ ఇలా ప్రధానమైన చోట్ల కాలువలను ఆక్రమించేశారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ ఆక్రమనలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్లా అక్రమణలను ధ్వంసం చేస్తున్నారు.

Similar News

News December 8, 2025

నెల్లూరు: హత్య కేసులో ఏడుగురు ముద్దాయిలకు జీవిత ఖైదు

image

అనంతసాగరం (M) పడమటి కంభంపాడులో 2014లో పంచాయతీ కుళాయి వద్ద జరిగిన హత్య కేసులో ఏడుగురు ముద్దాయిలకు జీవిత ఖైదుతో పాటు, ఒక్కొక్కరికి రూ.5 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు 8th ADJ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సింగమల రమణమ్మ హత్య కేసులో వద్దిబోయిన వెంకటేశ్వర్లు, రత్నయ్య, సుబ్బారెడ్డి, సుధాకర్ రెడ్డి, కేసరి వెంకటేశ్వర్లు, కలువాయి యర్రారెడ్డి, నాగులకంటి రమణారెడ్డికి శిక్ష ఖరారు చేశారు.

News December 8, 2025

నెల్లూరు: విష జ్వరాలపై కలెక్టర్ అత్యవసర సమావేశం

image

జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల అత్యవసర సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ, GGH వైద్యులతో నిర్వహించారు. బుచ్చి, రాపూరు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించనప్పటికీ లోపల మాత్రం దీనిపై పునరాలోచనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చినట్లు తెలిసింది.

News December 8, 2025

నెల్లూరు: రాపిడ్ కిట్లే లేవు..!

image

జిల్లాను స్క్రబ్ టైపస్ వ్యాధి బేంబేలెత్తిస్తుంది. చాప కింద నీరులా కేసులు విస్తరిస్తున్నాయి. బుచ్చిలో ఓ మహిళ విష జ్వరంతో మృతి చెందింది. ఈమెకు ప్రైవేట్ ఆసుపత్రిలో ర్యాపీడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. స్క్రబ్ టైపస్‌తో కాదని విష జ్వరంతో అని వైద్య శాఖ కప్పి పుచ్చుకుంటుంది. ర్యాపిడ్ కిట్లు కూడా వైద్యశాఖ వద్ద లేవు. 500 కిట్లు అడిగి ఉన్నామని DMHO చెబుతున్నా ఆ దిశగా చర్యలు లేకపోవడం గమనార్హం.