News April 16, 2025
నెల్లూరులో ఇద్దరు ఆత్మహత్య

పెళ్లి జరిగి ఏడాది తిరగక ముందే నెల్లూరులో ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ముదివర్తిపాలేనికి చెందిన స్మైలీ(23), నాగూర్ బాబు(ఇందుకూరుపేట) 7నెలల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూడో మైలులో నివాసం ఉంటుున్నారు. కులం పేరుతో నాగూర్ ఫ్యామిలీ వేధించడంతో స్మైలీ ఉరేసుకుంది. మూలాపేట పోలీస్ క్వార్టర్స్‌లో ఉండే ARకానిస్టేబుల్ నాగరాజు 9నెలల కిందట పూర్ణిమను రెండో పెళ్లి చేసుకోగా, కుటుంబ కలహాలతో పూర్ణిమ ఉరేసుకుంది.
Similar News
News April 22, 2025
నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు: నెల్లూరు కలెక్టర్

భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను జాప్యం లేకుండా వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భూసమస్యలు, రెవెన్యూ అంశాలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయన్నారు.
News April 21, 2025
చట్టపరంగా న్యాయం చేస్తాం: నెల్లూరు ఎస్పీ

నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. మొత్తం 119 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై త్వరితగతిన స్పందించి పరిష్కరించాలని పోలీసు అధికారులను ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశించారు. బాధితుల అర్జీలపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News April 21, 2025
వడ్డీతో సహా చెల్లిస్తాం: మేకపాటి

కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని వైసీపీ ఉదయగిరి ఇన్‌ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.