News May 12, 2024
నెల్లూరులో ఈసారి 85 శాతం అయ్యేనా?

గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 79 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈసారి 85 శాతానికి పెంచాలని అధికారులు కృషి చేస్తున్నారు. పోయినసారి ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయో చూద్దాం.
➤ కావలి: 76.3 ➤ ఆత్మకూరు: 83.3
➤ కోవూరు: 77.6 ➤ నెల్లూరు సిటీ: 663
➤ నెల్లూరు రూరల్: 65.2 ➤ సర్వేపల్లి: 82.1
➤ గూడూరు: 77.8 ➤ సూళ్లూరుపేట: 83.2
➤ వెంకటగిరి: 79.3 ➤ ఉదయగిరి: 80.3
Similar News
News December 31, 2025
నెల్లూరు: ఉచితంగా శిక్షణ

నెల్లూరు జిల్లాలోని గ్రామీణనిరుద్యోగ యువతకు డీఆర్డీఏ, సీడాప్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, బోగోలు, కోవూరులో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. టెలికామ్, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ జాబ్స్, టూరిజం తదితర రంగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 28 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.
News December 31, 2025
నెల్లూరు జిల్లాకు రూ.133.53 కోట్ల మంజూరు

నెల్లూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ బుధవారం ఉదయం మొదలైంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే నగదు అందజేస్తున్నారు. జిల్లాలో 3,03,465 మంది లబ్ధిదారులు ఉండగా.. వీరికి ప్రభుత్వం రూ.133.53 కోట్లు మంజూరు చేసిందని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి చెప్పారు.
News December 31, 2025
నెల్లూరు జిల్లాలో ఇలా చేస్తే నెలకు రూ.25వేలు

నెల్లూరు జిల్లాలో స్వచ్ఛరథం ఆపరేటర్లకు ప్రభుత్వం నెలకు రూ.25వేలు ఇస్తుంది. అతను ఇంటింటికీ తిరిగి KG ఇనుము, స్టీల్ వస్తువులు రూ.20, పేపర్లు రూ.15, గాజు సీసా రూ.2చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తడి, పొడి చెత్త తీసుకుని దానికి తగిన సరకులు ఇవ్వాలి. జనవరి 4లోపు MPDO ఆఫీసులో అప్లికేషన్లు ఇస్తే 9న ఎంపిక చేస్తారు. కావలి, కోవూరు, ముత్తుకూరు, వింజమూరు, ఆత్మకూరు, ఇందుకూరుపేట తదితర మండలాల్లో అవకాశం ఉంది.


