News May 11, 2024

నెల్లూరులో ఈ అభ్యర్థులు వారి ఓటు వారికే వేసుకోలేరు..!

image

కొద్ది రోజులుగా అందరి ఓట్లు అభ్యర్థిస్తున్న అభ్యర్థుల్లో కొందరు తమ ఓటు తమకు వేసుకోలేరు. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారికి ఓటు లేకపోవడమే కారణం. కోవూరులో హోరాహోరీగా తలపడుతున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కోటలో, వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు రూరల్‌లో ఓటు ఉంది. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి నెల్లూరు రూరల్‌లో, ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటు ఆత్మకూరులో ఉంది.

Similar News

News February 26, 2026

YCPలోనే ఆదాల.. పార్టీ మార్పు లేనట్లే!

image

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు. దీంతో మాజీ MP పార్టీ మార్పు ఊహాగానాలకు చెక్ పడింది.

News February 26, 2026

నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఒకరి మృతి?

image

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

News February 26, 2026

నెల్లూరు: మీ ఏరియాలో పాలు బాగుంటాయా?

image

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్‌ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తిస్తున్నారు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉండగా.. వీటిల్లో తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు. మీ దగ్గర పాలు బాగుంటాయా? లేదా?