News May 11, 2024
నెల్లూరులో ఈ అభ్యర్థులు వారి ఓటు వారికే వేసుకోలేరు..!

కొద్ది రోజులుగా అందరి ఓట్లు అభ్యర్థిస్తున్న అభ్యర్థుల్లో కొందరు తమ ఓటు తమకు వేసుకోలేరు. వారు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో వారికి ఓటు లేకపోవడమే కారణం. కోవూరులో హోరాహోరీగా తలపడుతున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి కోటలో, వేమిరెడ్డి ప్రశాంతికి నెల్లూరు రూరల్‌లో ఓటు ఉంది. సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి నెల్లూరు రూరల్‌లో, ఉదయగిరి వైసీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటు ఆత్మకూరులో ఉంది.
Similar News
News February 19, 2025
నెల్లూరు: నష్టపరిహారం ఇవ్వాలని వినతి

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నేత మిడతల రమేశ్ కోరారు. ఈ మేరకు నెల్లూరు ఆర్డీవో కార్యాలయ డీఏవో అనిల్‌కు వినతిపత్రం అందజేశారు. దుగ్గుంట, వావింటపర్తి, అంకుపల్లి పంచాయతీలో రైల్వే లైన్ రాళ్లు నాటి నాలుగేళ్లు దాటిందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
News February 18, 2025
నెల్లూరు కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాకాణి లేఖ

నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయ ధోరణితో రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ.. నిబంధనలకు విరుద్ధంగా 5 మంది సభ్యుల సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయడంపై లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడున్న కమిటీని రద్దుచేసి నిబంధన ప్రకారం కమిటీని ఎన్నుకోవాలన్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.
News February 18, 2025
నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <