News April 15, 2025
నెల్లూరులో కానిస్టేబుల్ భార్య సూసైడ్

నెల్లూరులో విషాద ఘటన వెలుగు చూసింది. చిన్నబజారు Ci కోటేశ్వరరావు వివరాల మేరకు.. AR కానిస్టేబుల్ నాగరాజు తన భార్య పూర్ణిమతో కలిసి ములాపేట పోలీస్ క్వార్టర్స్లో ఉంటున్నారు. వీరికి ఏడాది క్రితమే వివాహమైంది. ఈక్రమంలో ఇంట్లోనే పూర్ణిమ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగరాజు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆయన మొదటి భార్య సైతం ఉరేసుకుని చనిపోయారని తెలుస్తోంది.
Similar News
News October 26, 2025
వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్: అజీజ్

వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉమిద్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఉమిద్ యాక్ట్ ప్రకారం, రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ ఆస్తులు, మసీదులు, దర్గాలు, మదర్సాలు తప్పనిసరిగా డిజిటల్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వక్ఫ్ సంస్థల నిర్వాహకులకు ఆయన పిలుపునిచ్చారు.
News October 26, 2025
సకాలంలో పరిశ్రమల స్థాపనకు అనుమతులు: కలెక్టర్

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్లో జిల్లాస్థాయి పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మౌలిక వసతులను కల్పించాలని ఆయన సూచించారు.
News October 25, 2025
కృష్ణపట్నం పోర్టులో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక

బంగాళాఖాతంలో ఉన్న తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తుపాను ఏర్పడే అవకాశం ఉండడంతో ఒకటవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్ట్లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.


