News July 10, 2024
నెల్లూరులో గంజాయి ముఠా అరెస్ట్

నెల్లూరు నగరంలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముఠాను నవాబ్ పేట పోలీసులు ఆట కట్టించారు. ఏఎస్పీ సిహెచ్ సౌజన్య మాట్లాడుతూ.. రాబడిన సమాచారం మేరకు ఐదుమంది ముద్దాయిలను అరెస్ట్ చేసి 2 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దటమే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిఘా బృందాలతో నవాబ్ పేట ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News December 4, 2025
కండలేరుకు పెరుగుతున్న వరద నీరు

కండలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 6,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 11 గంటలకు 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండలేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రస్తుతం కండలేరులో నీటిమట్టం 60 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
News December 4, 2025
బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
News December 4, 2025
కండలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

దిత్వా తుఫాను నేపథ్యంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కండలేరు జలాశయాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని ఎస్.ఈ.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిరంతరం పర్యవేక్షించి, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీప గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.


