News July 11, 2024
నెల్లూరులో జనసేన కార్యాలయం ప్రారంభం

నెల్లూరు నగరంలోని గోమతి నగర్‌లో జనసేన జిల్లా పార్టీ ఆపీసు ఏర్పాటు చేశారు. దీనిని పూజా కార్యక్రమాలతో గురువారం ప్రారంభించారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. ఎవరికి అన్యాయం జరిగినా తమ పార్టీ కార్యాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. జనసేన పార్టీ పేద ప్రజల బాధలు తెలుసుకుని వారికి సహాయం చేసేందుకు ముందుంటుందని తెలిపారు.
Similar News
News February 9, 2025
నెల్లూరులో టీడీపీ ముఖ్య నేతల కీలక సమావేశం

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నామినేటెడ్ పోస్టులు వంటి పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఫరూక్, ఆనం రాంనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, పోలిట్ బ్యూరో సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
News February 9, 2025
నెల్లూరు: రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారుల దారుణ హత్య

నెల్లూరులో శనివారం కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా రెండేళ్ల క్రితం చిన్నా సోదరుడు సాయిపై కొందరు కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపేశారు. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారులు హత్యకు గురి కావడంతో వారి తల్లి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కాగా ఇప్పటికే చిన్నా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం GGHకు తరలించారు.
News February 9, 2025
నేడు ఆత్మకూరుకు రానున్న ఐదుగురు మంత్రులు

నేడు(ఆదివారం) ఆత్మకూరులో ఐదుగురు మంత్రుల బృందం పర్యటిస్తున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. మంత్రులు ఫరూక్, సవిత, బీసీ జనార్దన్, నారాయణ వారిలో ఉన్నారు. టిడ్కో నివాస ప్రాంతాల్లో సీతారామ ఆలయ నిర్మాణం, పంచాయతీరాజ్ నూతన అతిథి భవన నిర్మాణానికి శంకుస్థాపన, R&B నూతన అతిథిగృహ ప్రారంభం, జ్యోతిరావు ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలను వారు ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు.