News March 9, 2025

నెల్లూరులో నలుగురు దేవరపల్లి వాసులు అరెస్టు

image

రాగితీగలు, BSNLకు చెందిన వస్తువులు చోరీ చేస్తున్న ముఠాను ఎట్టకేలకు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు చిన్న బజార్ సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఇటీవల జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేయగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాంతానికి చెందిన రమణయ్య, దుర్గారావు, సింహాద్రి, నరసయ్యను అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

Similar News

News January 18, 2026

తూ.గో: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

కొవ్వూరు మండలం దేచర్ల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మట్ట సత్యనారాయణ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. పంగిడి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణతో పాటు ఉన్న కోటి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడు క్రషర్ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. సత్యనారాయణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 18, 2026

తెలుగు జాతి ఖ్యాతి ఎన్టీఆర్: పురందీశ్వరి

image

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురందీశ్వరి ఆదివారం ఆయనకు ఘన నివాళులర్పించారు. ఒక ఉత్తమ నాయకుడు జన్మిస్తే ఆ వంశానికే కాక మొత్తం జాతికే గుర్తింపు వస్తుందని కొనియాడారు. ఉన్నత విలువలు కలిగిన ఎన్టీఆర్ వల్ల తెలుగు ప్రజలకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫోటోను షేర్ చేస్తూ తన తండ్రి జ్ఞాపకాలను పురందీశ్వరి స్మరించుకున్నారు.

News January 18, 2026

వేగం కన్నా ప్రాణం మిన్న.. వాహనదారులకు ఎస్పీ హితవు

image

సంక్రాంతి ముగించుకుని గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు రహదారి నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ సూచించారు. రోడ్లపై రద్దీ దృష్ట్యా వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, వేగంగా వెళ్లడం కంటే క్షేమంగా చేరడం ముఖ్యమని హితవు పలికారు. వీలైనంత వరకు రాత్రి ప్రయాణాలు మానుకోవాలని కోరారు. అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు నివారించాలని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో కోరారు.