News January 30, 2025
నెల్లూరులో నెలవారీ నేర సమీక్షా సమావేశం

నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో చోటు చేసుకున్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలలో రికవరీల గురించి సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు. ప్రజలకు CCTV కెమెరాల ప్రాముఖ్యత వివరించి అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News February 14, 2025
చిన్న క్రాకలో ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీ చించివేత

జలదంకి మండలం చిన్న క్రాకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చించివేశారు. చిన్న క్రాకలో ఓ చెరువు వద్ద ఒక వర్గం ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించివేయడంతో రాజకీయంగా దుమారం లేపింది.
News February 14, 2025
పొదలకూరు: రావి ఆకుపై ప్రేమికుల చిత్రం

వాలంటైన్స్ డే సందర్భంగా విశ్రాంత డ్రాయింగ్ మాస్టర్ పచ్చ పెంచలయ్య ప్రేమికుల చిత్రాన్ని రావి ఆకుపై గీశారు. పొదలకూరు మండలం మహమ్మదాపురానికి పెంచలయ్య ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని వినూత్న చిత్రాలను గీస్తుంటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రేమికులందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
News February 14, 2025
నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూ రులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు ముందు టీచర్ మందలించడంతో మనస్తాపం చెంది భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆనంతరం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.