News March 9, 2025
నెల్లూరులో నేడు పవర్ కట్

నెల్లూరులోని పలు ప్రాంతాలలో మరికాసేపట్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మరమ్మతుల నేపథ్యంలో పినాకినీ అవెన్యూ, ఆకుతోట హరిజనవాడ, సర్వేపల్లి కాలువకట్ట, చిల్డ్రన్ పార్క్, అయోధ్యా నగర్, మధురా నగర్, అపోలో ఆస్పత్రి ప్రాంతాలలో ఉదయం 8 నుంచి మ.1గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు.
Similar News
News March 10, 2025
‘బీద’ ఫ్యామిలీ ‘డబుల్’ ఆఫర్

నెల్లూరు జిల్లాలో ‘బీద’ కుటుంబానికి MLC పదవి వరించింది. టీడీపీ కేంద్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్కు బీసీ కేటగిరిలో సీఎం చంద్రబాబు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. ఇప్పటికే ఆ కుటుంబంలోని బీద మస్తాన్ రావు వైసీపీ నుంచి టీడీపీలోకి రాగానే రాజ్యసభ సీటు ఇవ్వగా, ఆయన సోదరుడు బీద రవిచంద్రకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
News March 10, 2025
నెల్లూరు: పెళ్లి మండపంలో క్రికెట్ మ్యాచ్ లైవ్

పెళ్లి వేడుకల్లో చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రామలింగాపురంలోని ఓ కళ్యాణ మండపంలో వధూవరులు వినూత్నంగా అతిథుల కోసం ఇండియా న్యూజీలాండ్ క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు పెళ్లి వేడుకల్లోనే మ్యాచ్ను వీక్షించారు. వధూవరులు క్రికెట్పై తమ ప్రేమను ఇలా చాటుకున్నారని పలువురు ప్రశంసించారు.
News March 10, 2025
పొదలకూరు నిమ్మ యార్డుకు మంగళవారం సెలవు

హోలీ పర్వదినం సందర్భంగా పొదలకూరులోని ప్రభుత్వ నిమ్మ యార్డుకు మంగళవారం సెలవును ప్రకటిస్తూ అసోసియేషన్ తీర్మానం చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో హోలీ పండుగను ఘనంగా నిర్వహిస్తారని, ఇందులో భాగంగా వ్యాపార లావాదేవీలకు సుముఖత చూపించరన్నారు. ఇందుకోసం యార్డ్కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని యార్డ్ పరిధిలోని పరిసర ప్రాంతాల నిమ్మ రైతులు గమనించాలని కోరారు.