News August 21, 2024
నెల్లూరులో ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య
ప్రకాశం జిల్లా కొమురోలు గ్రామానికి చెందిన షేక్ జలీల్ (60) నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం మణికంఠ లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యా భర్తల మధ్య మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Similar News
News September 18, 2024
పోషకాహార లోపంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్
అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలెవరూ పోషకాహార లోపంతో బాధపడకూడదని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రకాశం భవనంలో ఐసీడీఎస్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి, వయస్సుకు తగినట్టుగా ఎత్తు, బరువు ఉండేలా తగిన ఆహారం అందించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం కచ్చితంగా అందేలా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
News September 18, 2024
ప్రభుత్వ ఆసుపత్రుల అధికారులతో ప్రకాశం కలెక్టర్ సమీక్ష
ఆస్పత్రులలో పారిశుద్ధ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా ఆస్పత్రుల వారీగా ఉన్న సిబ్బంది విధుల కేటాయింపు, పారిశుద్ధ్యం, భద్రత, వివిధ పనులలో పురోగతిపై చర్చించారు. హెచ్.డి.ఎస్. నిధుల లభ్యత, ఎన్.టి.ఆర్. వైద్య సేవలు లభిస్తున్న తీరు తదితరాలపై సమీక్షించారు.
News September 17, 2024
ఒంగోలులో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ఒంగోలు నగర పరిధిలోని హర్షిణి జూనియర్ ఇంటర్ కాలేజీల్లో ఓ విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వడ్డిముక్కల భావన మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.