News October 22, 2024

నెల్లూరులో ప్రాణం తీసిన ఫోన్ కాల్

image

ఫోన్ మాట్లాడుతూ పట్టాలు దాటే క్రమంలో ఓ రిటైర్డ్ ఉద్యోగి చనిపోయారు. నెల్లూరు బీవీ నగర్‌లో అటవీ శాఖ రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్(62) ఉంటున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ రీయింబర్స్మెంట్ పనులు చూసుకుని ఇంటికి బయలుదేరాడు. ఫోన్ మాట్లాడుతూ కరెంట్ ఆఫీస్ బీవీ నగర్ వద్ద రైల్వే గేటు దాటుతుండగా.. చెన్నై వైపు వెళ్తున్న రైలు ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ మృతిచెందారు.

Similar News

News November 13, 2024

నెల్లూరు: వందే భారత్ రైలు ఢీకొని మహిళ మృతి

image

కోవూరు మండలం పడుగుపాడు రైల్వే గేట్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. లేగుంటపాడు గ్రామానికి చెందిన సరోజమ్మ(65) రైల్వే గేటు దాటుతుండగా తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 13, 2024

నెల్లూరు జిల్లాలో దారుణ హత్య

image

భార్యను భర్త హత్య చేసిన ఘటన బోగోలు మండలంలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. విశ్వనాథనావుపేటకు చెందిన దత్తు.. తస్లీమా(35)ను మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో దత్తు మంగళవారం రాత్రి గొడవపడి కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతదేహాన్ని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 13, 2024

నెల్లూరు: DSC పరీక్షలకు ఉచిత శిక్షణ

image

ఏపీ బీసీ సంక్షేమశాఖ ఆదేశాల మేరకు DSC పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తిగల అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బీసీ సంక్షేమ అధికారి కే ప్రసూన ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లాకు చెందిన నిరుద్యోగ BC, SC,ST, EBC అభ్యర్థులు అర్హులన్నారు. వారి కుటుంబ వార్షిక ఆదాయం రు.లక్ష లోపు ఉండి, టెట్ అర్హత కలిగిన అభ్యర్థులు BC స్టడీ సర్కిల్‌లో 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.