News June 16, 2024
నెల్లూరులో భూగర్భ డ్రైనేజీకి మోక్షం!

నెల్లూరుకు 2016లో భూగర్భ మురుగునీటి వ్యవస్థ మంజూరైంది. నగరంలో మొత్తం 430 కి.మీ మేర మురుగునీటి పైపులైన్ వేయాల్సి ఉండగా 390 కి.మీ పైపులైన్ వేశారు. ఇంకొ 40కి.మీ నిర్మించాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పనులు నిలిచి పోయాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పదవి చేపట్టడంతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పూర్తవుతుందన్న ఆశ నెల్లూరు వాసులలో నెలకొంది.
Similar News
News January 23, 2026
నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.
News January 22, 2026
నెల్లూరు: ఆక్వా రైతులకు లైసెన్స్ తప్పనిసరి

నెల్లూరు జిల్లాలో ఆక్వా రైతుకు కరెంట్ సబ్సిడీ లబ్ధికి అనుమతులు తప్పనిసరి అని మత్స్యశాఖ అధికారిని శాంతి ఓ ప్రకటనలో తెలిపారు. APSADA & CAA చట్ట నిబంధనల మేరకు ఆక్వా సాగు చేయు (మంచి నీటి & ఉప్పు నీటి వనరులలో) ప్రతి రైతు కరెంటు సబ్సిడీని పొందుటకు తప్పనిసరిగా మత్స్యశాఖ ద్వారా లైసెన్సు పొందాలన్నారు. అనుమతి పొందని వారు ఈనెల 31వ తేదీ లోగా సచివాలయం ద్వారా లైసెన్సు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News January 22, 2026
NLR: న్యూస్ స్ట్రింగర్ల నియామకానికి దరఖాస్తులు

నెల్లూరు జిల్లాలో డీడీ న్యూస్ స్ట్రింగర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తుదారులు జిల్లాలోనే నివసిస్తూ, అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు రూ.1,180 ప్రాసెసింగ్ ఫీజుతో దరఖాస్తులను విజయవాడలోని దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి అందించాల్సి ఉంటుంది.


