News April 25, 2024

నెల్లూరులో మద్యం, నగదు స్వాధీనం

image

జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పోలీసులు తనిఖీల్లో నగదు, మద్యం గుర్తించి సీజ్ చేశారు. చిన్నబజారు పోలీసు స్టేషన్ పరిధిలో రూ.2 లక్షలు, సంతపేట పరిధిలో రూ.1.16 లక్షలు, దుత్తలూరులో రూ.65 వేలు స్వాధీనం చేసుకున్నారు. కావలిలో 10, బిట్రగుంటలో 30, అల్లూరులో 13, కొండాపురంలో 38, కలిగిరిలో 11, జలదంకిలో 17, వరికుంటపాడులో 18, సంగంలో 10, కందుకూరులో 14 మద్యం సీసాలను సీజ్ చేశారు.

Similar News

News January 25, 2025

కావలి వెంకటేశ్వర థియేటర్‌కు నోటీసులు జారీ

image

కావలి పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్‌కు RDO వంశీకృష్ణ నోటీసులు జారీచేశారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చిత్రానికి ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కానీ థియేటర్ యాజమాన్యం 24వ తేదీ కూడా అధిక రేట్లకు విక్రయించడంతో కావలికి చెందిన వెంకటేశ్వరరావుతోపాటు మరికొంతమంది ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం దీనిపై వివరణ ఇవ్వాలని RDO ఆదేశించారు.

News January 25, 2025

విద్యార్థులకు బహుమతులు అందజేసిన నగర కమిషనర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 21వ తేదీన 117 నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు మోడల్ స్కూల్ ప్రాంగణంలో క్విజ్, ఎస్సే రైటింగ్ , వక్తృత్వ పోటీలను నిర్వహించారు. అందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులను కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్  విద్యార్దులను అభినందించారు. అనంతరం బహుమతులను అందజేశారు.

News January 24, 2025

ఉదయగిరి: హైస్కూల్‌ సమీపంలో కొండచిలువ హల్‌చల్

image

ఉదయగిరి మండలం బిజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ వరి కోత మిషన్‌లో ఇరుక్కుని పోయి ఉండగా రైతులు గమనించి చంపేశారు. సమీపంలోనే పాఠశాల ఉండడం విద్యార్థులు తరచుగా అటు ఇటు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.