News February 3, 2025

నెల్లూరులో మునకపాక MBBS విద్యార్థి మృతి

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో పంప్ హౌస్ బ్యాక్ వాటర్ సమీపంలో మునగపాకకు చెందిన MBBS స్టూడెంట్ పెంటకోట షణ్ముఖ్ నాయుడు(18) గల్లంతయ్యాడు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న షణ్ముఖ్ ఆదివారం సెలవుకావడంతో స్నేహితులతో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. అతని డెడ్ బాడీని సోమవారం ఉదయం గుర్తించారు. షణ్ముఖ్ మృతితో మునగపాకలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News March 2, 2026

భీమవరం: పోలీస్ శాఖ పీజీఆర్ఎస్‌కు 14వ అర్జీలు

image

భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్‌ఎస్’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 14 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా అందాయి. అర్జీలపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.

News March 2, 2026

మహిళా ఉద్యోగులకు జీపీఎస్ రక్షణ వ్యవస్థ: సీతక్క

image

రాత్రి 8 గంటల తర్వాత ప్రయాణించే మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానం చేసిన సురక్షిత రవాణా విధానం అమలు చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. HYDలోని సచివాలయంలో మహిళా సంక్షేమం, భద్రత, సాధికారతపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు సమర్ధవంతంగా అమలవుతున్నా ఇంకా వ్యవస్థాపరమైన లోపాలున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. స్వయం సహాయక మహిళలకు హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు.

News March 2, 2026

నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్లకు టెన్త్‌ ప్రశ్నపత్రాలు

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 14వ తేదీ నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభం కానుండగా, వాటికి సంబంధించిన ప్రశ్నపత్రాలు జిల్లాకేంద్రానికి చేరుకున్నాయి. ఆదివారం పేపర్‌ -1 రాగా, సోమవారం కలెక్టరేట్ నుంచి పేపర్‌-1 ప్రశ్న పత్రాలు జిల్లాలోని పోలీస్‌ స్టేషన్లలో భద్రపరిచారు. జిల్లాలో 60 పరీక్షా కేంద్రాల్లో 10,658 మంది టెన్త్ పరీక్ష రాయనున్నట్లు డీఈవో రమేష్ కుమార్ తెలిపారు.