News February 3, 2025

నెల్లూరులో మునకపాక MBBS విద్యార్థి మృతి

image

నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో పంప్ హౌస్ బ్యాక్ వాటర్ సమీపంలో మునగపాకకు చెందిన MBBS స్టూడెంట్ పెంటకోట షణ్ముఖ్ నాయుడు(18) గల్లంతయ్యాడు. నెల్లూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో MBBS ఫస్ట్ ఇయర్ చదువుతున్న షణ్ముఖ్ ఆదివారం సెలవుకావడంతో స్నేహితులతో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. అతని డెడ్ బాడీని సోమవారం ఉదయం గుర్తించారు. షణ్ముఖ్ మృతితో మునగపాకలో విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News February 9, 2025

NZB: ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలి: MLC కవిత

image

అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని MLC కవిత అన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద వివిధ దేశాల్లో చదువుకుంటున్న తెలంగాణ విద్యార్థులతో BRS ఎమ్మెల్సీ కవిత జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు డబ్బులు విడుదల చేస్తున్నారు కానీ, విద్యార్థుల చదువుకు బకాయిలు విడుదల చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలన్నారు.

News February 9, 2025

మెదక్: కెనడా వెళ్లేందుకు సిద్ధం.. అంతలోనే ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మరాజుపల్లికి చెందిన శ్రీవర్ధన్ రెడ్డి (24) ఇటీవల డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏ చేసేందుకు కెనడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2025

రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

error: Content is protected !!