News July 25, 2024
నెల్లూరులో లీలామహల్ కనుమరుగు?

నెల్లూరులో ఎన్ని సినిమా హాళ్లు ఉన్నా.. అందరికీ లీలామహల్ అంటేనే ఇష్టం. అంతలా ఈ థియేటర్ సింహపురి ప్రజల మన్ననలు పొందింది. వారం క్రితమే ఇక్కడ సినిమాలు వేయడం ఆపేశారు. దానిని పడగొట్టి కొత్తగా మాల్ ఏర్పాటు చేయనున్నారు. 1960లో ప్రారంభమైన లీలామహల్లో పోకిరి 175, నువ్వేకావాలి 265 రోజులు ఆడింది. ఎన్నో అద్భుత సినిమాలు ప్రదర్శించిన లీలామహల్‌తో మీకు ఎంత అనుబంధం ఉందో కామెంట్ చేయండి.
Similar News
News February 26, 2026
నెల్లూరు: మీ ఏరియాలో పాలు బాగుంటాయా?

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తిస్తున్నారు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉండగా.. వీటిల్లో తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు. మీ దగ్గర పాలు బాగుంటాయా? లేదా?
News February 26, 2026
నెల్లూరు: కౌలు రైతులకు రిక్త హస్తం..!

2025-26 ఏడాదికి 38 వేల మందికి CCRC(పంట సాగుదారు హక్కు పత్రాలు) ఇవ్వాల్సి ఉండగా 22,600 మందికి మాత్రమే ఇచ్చారు. వీరికి ఇచ్చిన రుణాలపై లీడ్ బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులు వద్ద లెక్కలు లేవట. యజమానులు తమ భూములుపై ఇప్పటికే రుణాలు తీసుకోగా కౌలు కార్డుదారులకు రుణాలు అందడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు అందక.. బయట అధిక వడ్డీల భారం మోయలేక కౌలు రైతులు డీలా పడుతున్నారు. రబీ స్టార్ట్ అయి 2 నెలలు అవుతోంది.