News August 18, 2024
నెల్లూరులో వెలుగు చూసిన ఘరానా మోసం

నెల్లూరులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మనీ స్కీం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి ట్రస్ట్ పేరుతో జనాలకు టోకరా వేశారు. బాధితుల వివరాలు మేరకు.. చెన్నైకి చెందిన ఓ సంస్థ నెల్లూరు పొదలకూరు రోడ్డు వద్ద ఇంకో ట్రస్ట్ సహాయంతో ఒక సభ్యత్వానికి రూ.500 కడితే రూ.7లక్షలు, మరో సభ్యత్వానికి రూ.5 వేలు కడితే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పి 10 వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారని బాధితులు లబోదిబోమన్నారు.
Similar News
News December 5, 2025
అటు వెళ్లకండి.. నెల్లూరు జిల్లా వాసులకు అలర్ట్.!

నెల్లూరు జిల్లాలోని అన్నీ చెరువులు, రిజర్వాయర్లు, దిత్వా తుఫాను ప్రభావంతో నిండుకుండల్లా ఉన్నాయి. దీంతో పలుచోట్ల పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు రెవెన్యూ సిబ్బంది ప్రజలను చెరువులవద్దకు వెళ్లకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో నీటి ప్రవాహానికి ముగ్గురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. వరద ప్రాంతాల్లో ప్రజలు మోహరించకుండా బారికేడ్లు, పెట్రోలింగ్ వాహనాల ద్వారా గస్తీ కాస్తున్నారు.
News December 5, 2025
నెల్లూరు: భారీ వర్షాలకు ఒకరు మృతి.. మరొకరు గల్లంతు..

నెల్లూరు ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. నెల్లూరు పొర్లుకట్ట ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థి మస్తాన్ గురువారం పొట్టెపాలెం కలుజులో పడి మృతి చెందాడు. నెల్లూరు శివారు ప్రాంతం కొండ్లపూడికి చెందిన రవికుమార్ బుధవారం సాయంత్రం నెల్లూరు కాలువలో గల్లంతయ్యారని సమాచారం. తండ్రి గల్లంతైనట్లు రవికుమార్ కుమార్తె కావ్య గురువారం నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News December 5, 2025
నేడు BPCL అంశంపై ప్రజాభిప్రాయ సేకరణ

గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. BPCL కంపెనీ ఏర్పాటు వలన పర్యావరణ అంశంపై రామాయపట్నం పోర్టు వద్ద ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటామన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
ఈ సభలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొంటారని వివరించారు.


