News February 1, 2025
నెల్లూరులో వేడెక్కిన రాజకీయాలు
సింహపురిలో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై సిగపట్లు మొదలయ్యాయి. దీంతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికపై వైసీపీ, కూటమి నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. నువ్వా-నేనా అన్న విధంగా జిల్లాలో అధికార, ప్రతిపక్షం నాయకులు పోటీకి కాలు దువ్వుతున్నారు. బుచ్చి వైస్ ఛైర్మన్ పదవి విషయంలో మండల వైసీపీ నాయకులే టీడీపీలో చేరడం గమనార్హం.
Similar News
News February 1, 2025
రూరల్ ఎమ్మెల్యేతో భేటీ అయిన మంత్రి నారాయణ
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో శనివారం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ భేటీ అయ్యారు. నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికపై వారు చర్చించారు. అనంతరం డిప్యూటీ మేయర్ ఎంపికపై మరికాసేపట్లో కార్పొరేటర్లతో మంత్రి సమావేశం కానున్నారు.
News February 1, 2025
బుచ్చిలో YCPకి గట్టి షాక్
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ మాజీ వైస్ఛైర్మన్, 19వ డివిజన్ కౌన్సిలర్ కోటంరెడ్డి లలితమ్మ ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి గుడ్బై చెప్పారు. ఈ మేరకు వారు TDP తీర్థం పుచ్చుకున్నారు. మూడో తేదీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరటం చర్చనీయాంశమైంది. బుచ్చి వైసీపీ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి కూడా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
News February 1, 2025
నెల్లూరు జిల్లాలో తాత్కాలికంగా ఆగిన పెన్షన్ పంపిణీ
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రాంతాలలో సర్వర్ సమస్యల వల్ల పెన్షన్ల పంపిణీ ఆగినట్లు స్థానికుల తెలిపారు. అల్లూరు మండలంలోని పురిని, ఇందుపూరు తదితర ప్రాంతాల్లో సర్వర్ తాత్కాలికంగా ఆగిపోయింది. లబ్ధిదారులు పెన్షన్ నగదు కోసం ఎదురుచూస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉందా.?