News November 20, 2024

నెల్లూరులో వైసీపీ నేతల కీలక సమావేశం

image

నెల్లూరులో వైసీపీ నేతల కీలక సమావేశం జరుగుతోంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి విక్రమ్ రెడ్డి, ఖలీల్, ఆనం అరుణమ్మ, విజయకుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. పార్టీ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు.

Similar News

News February 24, 2026

నెల్లూరులో లారీ ఢీకొని బెస్ట్ ఫ్రెండ్స్ మృతి

image

నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన హేమేంద్ర(22), వెంకటేశ్వరపురానికి చెందిన నూరుల్లా(20) మంచి స్నేహితులు. హేమేంద్ర కారు షోరూములో టెక్నీషియన్‌గా, నూరుల్లా ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి ఇద్దరు బైకుపై హైవే మీదుగా వెంకటేశ్వరపురానికి బయల్దేరారు. చెన్నై వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో స్నేహితులు ఇద్దరూ చనిపోయారు.

News February 24, 2026

నెల్లూరు: బైక్ చోరీ.. పదేళ్ల తర్వాత శిక్ష

image

పదేళ్ల క్రితం జరిగిన బైక్‌ చోరీ కేసులో నిందితుడికి కోర్టు ఏడాది సాధారణ జైలుశిక్ష విధించింది. 2015లో నెల్లూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మోటారు సైకిల్‌ చోరీకి గురవ్వగా, నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో యలమవారిదిన్నెకు చెందిన పవన్‌కల్యాణ్‌ను అరెస్టు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.