News March 9, 2025

నెల్లూరులో సూర్యాపేట వాసుల మృతి

image

సూర్యాపేట జిల్లా ఆత్మ‌కూరు మండ‌లానికి చెందిన నిషిత‌ (22), కార్తీక్‌ (20) అనే అక్కాతమ్ముళ్లు నెల్లూరు శివార్ల‌లోని భ‌గ‌త్ సింగ్ కాల‌నీలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వారు ప్రయాణిస్తున్న కారు డ్రైవ‌ర్ నిద్ర‌మ‌త్తులో లారీని ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ స్పాట్‌లో మృతి చెంద‌గా, ముగ్గురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2026

బలమైన బంధం కోసం రోజూ శృంగారం: సైంటిస్టులు

image

బలమైన సంబంధాల కోసం భార్యాభర్తలు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొనాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. భాగస్వాములు సన్నిహితంగా ఉన్న రోజుల్లో వారిలో ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. కానీ ఇది 24 గంటల వరకేనని సూచిస్తున్నారు. అయితే రిలేషన్‌లో సమస్యలను తగ్గించుకునేందుకు జరిపే శృంగారం వల్ల తర్వాతి రోజు ఒత్తిడి పెరగొచ్చని హెచ్చరిస్తున్నారు. 319 జంటలపై చేసిన ఈ స్టడీ Archives of Sexual Behaviorలో ప్రచురితమైంది.

News February 9, 2026

శ్రీశైలంలో నేడు బృంగివాహన సేవ

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నేడు మల్లన్న బృంగివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3 వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు

News February 9, 2026

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు.. 40లక్షల లడ్డూలు

image

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు బృంగి వాహనంపై మల్లన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. ద్వారకా తిరుమల దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 3వేల మంది పోలీసులతో భద్రత కల్పించి, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచారు. భక్తుల కోసం 40 లక్షల లడ్డూలను అధికారులు అందుబాటులో ఉంచారు.