News March 25, 2024
నెల్లూరులో స్నేహితుడిపై హత్యాయత్నం

నెల్లూరులోని కోటమిట్టకు చెందిన మసూద్, బారకాసు సెంటర్ కు చెందిన సోహెల్ స్నేహితులు. ఫోన్ లో మాట్లాడుకునే సమయంలో వాగ్వాదం జరిగి మనస్పర్ధలు ఏర్పడ్డాయి. శనివారం రాత్రి సోహెల్ ఫోన్ చేసి పిలవడంతో మరొకరితో పాటు రంగనాయకులపేటకు మసూద్ వెళ్లాడు. అక్కడ మాటామాటా పెరగడంతో సోహెల్ తన స్నేహితులతో కలిసి మసూద్ ను కత్తితో పొడిచి పరారయ్యాడు. మసూద్ ను అస్పత్రికి తరలించారు. సంతపేట పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News February 27, 2026
చెవులు మూసుకుని నెల్లూరు MLC నిరసన

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై చర్చించాలని శాసనమండలిలో వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వారంతా మండలిలో కింద కూర్చొని ఆందోళన చేశారు. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చెవులు మూసుకుని, ఇతర MLCలు కళ్లు, నోరు మూసుకుని తమ నిరసన తెలిపారు.
News February 27, 2026
నెల్లూరు DPO కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలోని పంచాయతీల్లో 100% ఇంటి పన్నులను సెక్రటరీలు వసూలు చేయాలని DPO వసుమతి ఆదేశించారు. జిల్లాలో మార్చి నెలాఖరు నాటికి పన్నులు వసూలు చేయాలని చెప్పారు. పాదలకూరు, కోవూరు, వింజమూరు, రాపూరు పంచాయతీల్లో పన్నులు భారీగా పేరుకుపోయాయని తెలిపారు. వీటిని రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు.
News February 27, 2026
నెల్లూరు: కిడ్నాప్.. తల లేకుండా డెడ్‌బాడీ లభ్యం

ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యువకుడి మృతి కలకలం రేపింది. ముస్లిం వీధికి చెందిన ఉస్మాన్ ఓ హిజ్రాతో సన్నిహితంగా ఉండేవాడు. ఆమెకు చెందిన కొంత బంగారాన్ని అతని అన్న హుస్సేన్(33) తాకట్టు పెట్టి నగదు వాడుకున్నాడు. దీంతో ఆ హిజ్రా మరికొందరితో వచ్చి హుస్సేన్‌ను ఆటోలో తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఏమైందో ఏమో గురువారం పండ్లూరు వద్ద రైల్వే పట్టాలపై తల లేని మొండెంగా హుస్సేన్ డెడ్‌బాడీ దొరికింది.


