News December 1, 2024

నెల్లూరులో హెల్ప్ లైన్ నంబర్లు ఇవే 

image

నెల్లూరు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశాలు జారీ చేశారు. విపత్తు సహాయక బృందాలు తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని వరద బాధితులు తమ సమస్యలను 9494018118 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా 0861-2356777 & 0861-2316777 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News December 6, 2024

నెల్లూరు జిల్లాలో ‘పుష్ప-2’ అరుదైన రికార్డ్

image

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ సినిమా నెల్లూరు జిల్లాలో ఓ అరుదైన రికార్డ్ నమోదు చేసింది. జిల్లా వ్యాప్తంగా 58 థియేటర్లలో ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు పూర్తి అయ్యే సమయానికి ఒక్కో థియేటర్‌లో 8 షోల చొప్పున 464 షోలు ప్రదర్శితమయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. దీంతో మొదటి రోజు నుంచే ‘పుష్ప-2’ రికార్డులు మొదలయ్యాయని అభిమానులు సంబరపడుతున్నారు.

News December 6, 2024

పండగ వాతావరణంలో మెగా PTM ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ఏర్పాటుకు సంబంధించి పూర్తి చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా పండగ వాతావరణంలో జరిగేలా ఇప్పటికే సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రేపటి నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News December 5, 2024

నాయుడుపేటలో  సినీ నటుడు సత్య ప్రకాశ్ పూజలు

image

నాయుడుపేటలో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం, ఉమామహేశ్వర దేవాలయాలను గురువారం ప్రముఖ సినీ నటుడు సత్య ప్రకాశ్ దర్శించుకొని, పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈ దేవాలయాల సందర్శన పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల, శ్రీశైలం క్షేత్రంను దర్శించుకున్నట్లు ఉందని సత్య ప్రకాశ్ అన్నారు.