News May 20, 2024

నెల్లూరులో హై అలెర్ట్..!

image

ఎన్నికల పోలింగ్ తర్వాత రాష్ట్రంలోని పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం, త్వరలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో నెల్లూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులోకి తెస్తున్నారు. ఇప్పటికే పలు డివిజన్లలో అధికారులు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా నెల్లూరు సిటీలోనూ అమలులో ఉందని DSP శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Similar News

News November 18, 2025

నెల్లూరు: సంగం వద్ద RTC బస్సుకు తప్పిన ప్రమాదం

image

నెల్లూరు జిల్లా సంగం వద్ద RTC బస్సుకు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. షాట్ సర్క్యూట్‌తో బస్సుకింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మంటలు గమనించి బైక్‌తో బస్సును చేజ్ చేసి ఆపాడు. అనంతరం బస్సులోని వారందరినీ డ్రైవర్ కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

News November 18, 2025

రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

News November 18, 2025

ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్‌తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.