News June 4, 2024

నెల్లూరులో 1708 ఓట్ల అధిక్యంలో వేమిరెడ్డి

image

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావలి సెగ్మంట్‌లో 5357 ఆధిక్యంలో నిలిచారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి 3649ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. వేమిరెడ్డి 1708 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News October 16, 2025

నెల్లూరు చేపల పులుసా.. మజాకా.!

image

నెల్లూరు చేపల పులుసుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజా చేపలతో చేసే ఈ పులుసును ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మన నెల్లూరు చేపల పులుసును ఇతర దేశాలకు సైతం సరఫరా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు చేపల కూరలతో మెట్రోపాలిటన్ సిటీలో కూడా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. టేస్ట్‌తోపాటూ దీనిలోని సహజ పోషక లక్షణాలు హృదయ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.

News October 16, 2025

కూతురిపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు

image

కూతురిపై తాగిన మైకంలో అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రికి కోర్టు జీవిత ఖైదు విధించింది. జలదంకి మండలానికి చెందిన బాలరాజు 2019 జూన్ 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూతురిపై అత్యాచారం చేశారు. ఆమెకు గర్భం రావడంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.

News October 16, 2025

నెల్లూరు: నెల రోజులు ఇండస్ట్రీ పార్ట్నర్ షిప్ డ్రైవ్

image

నెల్లూరు జిల్లాలో బుధవారం నుంచి నెల రోజులు APIICఆధ్వర్యంలో ఇండస్ట్రీ పార్టనర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టరేట్‌లో సంబంధిత వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యంగా డ్రైవ్ జరుగుతుందన్నారు.