News December 27, 2024
నెల్లూరులో 30 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పోలీసు కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ తెలిపారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 30వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీలకు జిల్లాలో 4690 మంది అభ్యర్థులలో 3,855 మంది పురుషులు, 835 మంది స్త్రీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.
Similar News
News December 29, 2024
నెల్లూరు: రూ.3.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
నెల్లూరులో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కామాటివీధికి చెందిన సాయికిరణ్ అమెరికాలో ఉంటున్నాడు. బృందావనంలోని ఓ బ్యాంకు ఖాతాలో ఇటీవల కొంత నగదు జమ చేశారు. అందులోని రూ.3.96 లక్షలను గత నెల 7న గుర్తుతెలియని వ్యక్తులు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు ఇటీవల గుర్తించాడు. దీంతో నెల్లూరులో ఉంటున్న తండ్రి రమేశ్ బాబు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, చిన్నబజార్ సీఐ కోటేశ్వరరావు విచారణ చేపట్టారు.
News December 29, 2024
నెల్లూరు:మహిళా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు దోహదపడండి
వ్యాపార, వాణిజ్య రంగాల ద్వారా ఆర్థిక స్వయం ప్రతిపత్తిని సాధించి మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మెప్మా రిసోర్స్ పర్సన్ (ఆర్.పి) సిబ్బంది దోహదపడాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మహిళలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల అమలుపై రెండు బృందాలకు శనివారం కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శిక్షణ తరగతులను నిర్వహించారు.
News December 28, 2024
నెల్లూరు: కాకాణితో ఆదాల భేటీ
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం పార్టీ పరిశీలకులు ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వారు జిల్లాలో ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ పటిష్ఠత, కార్యకర్తలకు అండగా ఉండటం తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు నడుచుకోవాలని వారు నిర్ణయించారు.