News February 1, 2025

నెల్లూరులో RTC బస్సు టైర్ కింద పడి విద్యార్థి మృతి

image

నెల్లూరులో BUS కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. కొడవలూరు(M) రేగడిచెలికు చెందిన మహేందర్ నెల్లూరులో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ అనంతరం ఇంటికి వెళ్లేందుకు BUS ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లగానే ప్రయాణికుల కోసం BUS ఆపిన డ్రైవర్ అనంతరం BUSను కదిలించాడు. పుట్‌పాట్‌పై ఉన్న మహేందర్ పట్టు తప్పి BUS వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 

Similar News

News August 23, 2025

తాడేపల్లిలో కాకాణితో ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి భేటీ

image

తాడేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలు చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితుల గురించి వివరించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో చేయాల్సిన పోరాటాలపై మాట్లాడుకున్నారు.

News August 22, 2025

నెల్లూరు వ్యవసాయ ప్రయోగశాలకు జాతీయ స్థాయి గుర్తింపు

image

నెల్లూరు ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎరువులు, సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. రైతులకు ఎరువుల నాణ్యత, నేల సారవంతంపై మెరుగైన సలహాలు అందిస్తున్నందుకు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నెల్లూరు అగ్రికల్చర్‌ ల్యాబ్‌కు జాతీయస్థాయి గుర్తింపు రావడంతో కలెక్టర్ ఆనంద్ వారిని అభినందించారు.

News August 22, 2025

జగన్ పథకాలను కాపీకొట్టడమే చంద్రబాబుకు తెలుసు: కాకాణి

image

CM చంద్రబాబుకు కొత్త పథకాల ఆలోచన ఎప్పుడూ రాదని, YCP అధినేత జగన్‌ పథకాల్ని కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు అవస్థలు పడుతున్నారు. కీలక సమయంలో ఎరువులు అందలేదు. YCP ప్రభుత్వం RBKల ద్వారా అన్నీ సమకూర్చాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా గాలికొదిలేసింది’ అని అన్నారు.