News February 1, 2025
నెల్లూరులో RTC బస్సు టైర్ కింద పడి విద్యార్థి మృతి

నెల్లూరులో BUS కిందపడి విద్యార్థి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. కొడవలూరు(M) రేగడిచెలికు చెందిన మహేందర్ నెల్లూరులో ఇంటర్ చదువుతున్నాడు. కాలేజీ అనంతరం ఇంటికి వెళ్లేందుకు BUS ఎక్కాడు. కొద్ది దూరం వెళ్లగానే ప్రయాణికుల కోసం BUS ఆపిన డ్రైవర్ అనంతరం BUSను కదిలించాడు. పుట్‌పాట్‌పై ఉన్న మహేందర్ పట్టు తప్పి BUS వెనుక టైర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News February 17, 2025
మహాశివరాత్రి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆనం ఆవిష్కరణ

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం మహా శివరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఆత్మకూరు పట్టణ సమీపంలోని తిరునాళ్ల తిప్ప వద్ద శ్రీ కాశినాయన ఆశ్రమంలో ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా కల్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రావాలని ఆలయ కార్యనిర్వాహకులు కోరారు.
News February 16, 2025
నెల్లూరు: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏపీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కే.సుమన్, సహాధ్యక్షులు సంపత్ కుమార్ కోరారు. నెల్లూరు జిల్లాలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మహీధర్ బాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి పేట రాజేశ్ పాల్గొన్నారు.
News February 16, 2025
జగన్ 2.O పాలనలో అందరి లెక్కలు తేలుస్తా: కాకాణి

జగన్ 2.O ప్రభుత్వం రాగానే అతిగా ప్రవర్తించే వారందరి లెక్కలు తేల్చుతామని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. పొదలకూరు(M) బిరుదవోలులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు.