News July 21, 2024
నెల్లూరు: అంగన్వాడీలకు అందని కందిపప్పు

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 20 రోజులు దాటిన అంగన్వాడీలకు ఇప్పటికీ కందిపప్పు సరఫరా జరగలేదు. జిల్లాలో 12 ఐసీడీఎస్ ప్రాజెక్టులు పరిధిలో 2934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. రేషన్ ద్వారా బియ్యం, కందిపప్పు నూనె సరఫరా జరుగుతుంది. కానీ ఈనెల 20వ తేదీ దాటినప్పటికీ కందిపప్పు సరఫరా చేయకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల్లో గర్భవతులు, బాలింతలకు కందిపప్పు పంపిణీ చేయకపోవడంతో పలు చోట్ల కార్యకర్తలతో గొడవలకు దిగుతున్నారు.
Similar News
News September 15, 2025
అక్టోబర్ 15 వరకు గాలికుంటు వ్యాధి టీకాలు : డీడీ

జిల్లాలో ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలను వేస్తున్నట్లు పశు సంవర్ధక శాఖ డీడీ సోమయ్య తెలిపారు. స్థానిక ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో పశు వ్యాధి నియంత్రణలో భాగంగా పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమాన్ని ఏడీలు రామచంద్రరావు, చైతన్య కిషోర్లతో కలిసి ప్రారంభించారు. నాలుగు మాసాలు నిండిన పశువులకు ఈ టీకాలను తప్పనిసరిగా వేయించాలని, ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు.
News September 15, 2025
USలో లక్షల జీతం వద్దనుకుని.. నెల్లూరు SPగా

USలో లక్షల డాలర్ల జీతం వద్దనుకుని IPS బాట పట్టారు నెల్లూరు కొత్త SP అజిత వాజెండ్ల. గుంటూరు(D)కు చెందిన ఆమె ప్రైమరీ విద్యను AP, మెకానికల్ ఇంజినిరింగ్‌ను మద్రాస్ ITలో పూర్తి చేశారు. అనంతరం USలో భారీ ప్యాకేజీతో ఉద్యోగంలో చేరారు.అది నచ్చక సివిల్ సర్వీస్‌లోకి రావాలని HYD వర్సిటీలో పబ్లిక్ సర్వీస్‌లో పీహెచ్డీ చదువుతూ సివిల్స్‌కు ఎంపికయ్యారు. నగరంలో పెరుగుతున్న క్రైంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
News September 14, 2025
పార్లమెంటులో నెల్లూరు MP పని తీరు ఇదే.!

2024- 25వ సంవత్సరానికి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పనితీరును పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పార్లమెంట్లో ప్రజా సమస్యలపై 73 ప్రశ్నలు సంధించారు. 77.94 శాతం అటెండెన్స్ కల్గి ఉన్నారు. నాలుగు చర్చా కార్యక్రమాలలో పాల్గొని ప్రజావాణి వినిపించినట్లు పార్లమెంట్ వర్గాలు నివేదికను వెల్లడించాయి.