News November 6, 2024
నెల్లూరు: అండర్ బ్రిడ్జ్ వద్ద నిలిచిన వర్షపు నీరు

నెల్లూరు పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్‌లో వర్షపు నీరు నిలబడి వాహనాల రాకపోకలకు, పాద చారులు నడవడానికి ఆటంకం ఏర్పడింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తూ సహకరిస్తున్నారు.
Similar News
News November 14, 2025
నెల్లూరు: KG మటన్ రూ.500.. బారులు తీరిన జనాలు

ఆఫర్స్ పెట్టీ కస్టమర్స్‌ని ఆకట్టుకోవడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘటనే నెల్లూరులోని బీవీ నగర్‌లో జరిగింది. ఓ మటన్ షాప్ ప్రారంభోత్సవం సందర్భంగా కిలో మటన్ 500 రూపాయలే అని బోర్డ్ పెట్టడంతో చుట్టు పక్కల జనాలు అందరూ బారులు తీరారు. మార్కెట్‌లో 1000 రూపాయలకు దొరికే మటన్ రూ.500కి వస్తుండటంతో ఆ షాప్ వద్దకు జనాలు క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంతం కాస్త రద్దీగా మారింది.
News November 14, 2025
నెల్లూరు: 2 రోజుల పోలీస్ కస్టడీకి కిలాడి లేడీ డాన్ అరుణ

నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కిలాడి లేడీ డాన్ అరుణ రెండు రోజుల కస్టడీ నిమిత్తం గురువారం విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై, అంగన్వాడి పోస్టులు ఇప్పిస్తామంటూ మోసగించినట్లు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీలో తీసుకుని విజయవాడకు తరలించారు.
News November 14, 2025
నెల్లూరు: సైలెంట్ కిల్లర్‌కు చెక్ పెట్టేది ఎలా.?

మధుమేహ వ్యాధి గురించి జిల్లా వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. NOV 14 తేదీని ‘వరల్డ్ డయాబెటిస్ డే’ గా పాటిస్తున్న సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లాలో 6 లక్షల మందికి పైగా మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. సైలెంట్ కిల్లర్ అని చెప్పుకునే మధుమేహానికి సరైన జీవనశైలితో చెక్ పెట్టొచ్చని అంటారు.


