News November 6, 2024
నెల్లూరు: అండర్ బ్రిడ్జ్ వద్ద నిలిచిన వర్షపు నీరు
నెల్లూరు పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్‌లో వర్షపు నీరు నిలబడి వాహనాల రాకపోకలకు, పాద చారులు నడవడానికి ఆటంకం ఏర్పడింది. వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆ నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు ప్రజలకు సూచనలు చేస్తూ సహకరిస్తున్నారు.
Similar News
News December 5, 2024
సోమశిల జలాశయానికి భారీ వరద
సోమశిల జలాశయంలో 71.451 టీఎంసీల నీటిమట్టం నమోదైనట్లు జలాశయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పెరుగుతూ 13,467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యానికి మరో ఆరు టీఎంసీల నుంచి ఏడు టీఎంసీల వరకు కావలసి ఉంది. జలాశయం నుంచి కండలేరు వరద కాలువ ద్వారా కండలేరుకు 2000 క్యూసెక్కులు, స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు.
News December 4, 2024
అల్లూరు: దెయ్యం పేరుతో బురిడీ
అల్లూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్వామి మాల ధరించి ఒక వ్యక్తి దగ్గర నుంచి బంగారు నగలు అపహరించారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా చేసుకొని ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించారు. పూజలు చేస్తే దెయ్యం వెళ్లిపోతుందన్నారు. అనంతరం బాధితుడి నుంచి బంగారు నగలు అపహరించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News December 4, 2024
మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి: ఎంపీ వేమిరెడ్డి
దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం కోరారు. లోక్‌సభలో ఆయన మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.