News April 3, 2025
నెల్లూరు: అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఆర్మీలో చేరాలనుకుంటున్న నెల్లూరు యువతకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26 అగ్ని వీర్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటర్ పూర్తి చేసిన వాళ్లు అర్హులు. ట్రైనింగ్తో పాటు నాలుగేళ్లు ఆర్మీలో పనిచేయాల్సి ఉంటుంది. ఈనెల 10వ తేదీలోపు www.joinindainarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. యువకులతో పాటు మహిళలు సైతం అప్లై చేసుకోవచ్చు.
Similar News
News April 12, 2025
మత విద్వేషాలను రెచ్చగొట్టుతున్న భూమన: కాకర్ల

మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉదయగిరి MLA కాకర్ల సురేశ్ విమర్శలు గుప్పించారు. టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ గోమరణాలపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా టీటీడీ భక్తుల మనోభావాలను ఆయన దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.
News April 12, 2025
ఉదయం 6 నుంచే పనిచేయండి: నారాయణ

మంత్రి నారాయణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లను ఉదయం 6 గంటలకే నిద్ర లేపుతున్నారు. అమరావతి నుంచి శనివారం ఉదయం 6 గంటలకు కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెల్లవారుజామున పట్టణాల్లో పర్యటించాలని ఆదేశించారు. తానూ ఏదో ఒక మున్సిపాల్టీలో ఉదయం 6 గంటలకు పర్యటిస్తానని చెప్పారు.
News April 12, 2025
ఇంటర్ ఫలితాల్లో ఉదయగిరి విద్యార్థుల ప్రభంజనం

ఇంటర్ ఫలితాల్లో ఉదయగిరి ప్రాంత విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారు. ఉదయగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థిని వేదముఖి 987 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఉదయగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థిని లతిఫా 963 మార్కులు సాధించగా, జూనియర్ ఇంటర్ విద్యార్థిని అంజుమ్ 464 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ మధు కిరణ్ తెలిపారు.