News May 11, 2024

నెల్లూరు: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

భారత సైన్యంలో అగ్నివీర్ రిక్రూట్ మెంట్ జరుగుతోందని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు జిల్లా ఉపాధి అధికారి రామాంజనేయులు తెలిపారు. 17 నుంచి 21 ఏళ్ల లోపు వారు అర్హులని వెల్లడించారు. నేవీలో పోస్టుకు పదో తరగతి, ట్రేడ్ మాన్ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆన్ లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

Similar News

News February 15, 2025

నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ఉపాధ్యాయుడిపై కేసు 

image

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఉపాధ్యాయుడిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని తోటి విద్యార్థులు ముందు టీచర్ హేళనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది హాస్టల్ భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు దర్యాప్తు చేసి ఉపాధ్యాయుడు వీర రాఘవులుపై కేసు నమోదు చేశారు.

News February 15, 2025

నెల్లూరు: పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

News February 15, 2025

ప్రాక్టికల్ పరీక్షలలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: ఆర్ఐఓ

image

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల్లో ప్రధాన భాగస్వాములైన ఎగ్జామినర్లు, చీఫ్, అడిషనల్ సూపరింటెండెంట్ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం తుది విడత పరీక్ష కేంద్రాల చీఫ్ అడిషనల్, చీఫ్ సూపరింటెండెంట్‌‌లకు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆర్ఐఓ సూచించారు. పరీక్ష పై ఆపోహలు, ఆరోపణలు రాకుండా చూడాలని కోరారు.

error: Content is protected !!