News July 21, 2024
నెల్లూరు: అత్యధిక వర్షపాతం సీతారాంపురం, అత్యల్పం బోగోలు

జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరుగా వర్షం కురుస్తుంది. శనివారం జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా సీతారాంపురం మండలంలో 40.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అదేవిధంగా ఉదయగిరిలో 18.0, దుత్తలూరులో 17.6, కందుకూరులో 16.8, కొండాపురంలో 12.3, కావలిలో 9.6, సంగంలో 9.0, మర్రిపాడులో 7.8, నెల్లూరు రూరల్ 7.4, బోగోలులో 7.2 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయ్యింది.
Similar News
News November 18, 2025
దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.

నెల్లూరు : రేషన్ కార్డుల జారీలో జాప్యం

అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సంబంధించి 7,10,998 స్మార్ట్ రైస్ కార్డులు మంజూరవగా 6,35,716 కార్డులు పంపిణీ చేసారు. ఇంకా 75,282 కార్డులు సచివాలయాల్లో ఉన్నాయి. మరోవైపు రేషన్ కార్డులోని సభ్యులందరికి EKYC లు పెండింగ్లో ఉన్నాయి. వీటిల్లో 20,17,681 యూనిట్లు E-KYC చేయాల్సి ఉండగా 19,41,252 యూనిట్లకు పూర్తి చేశారు. మరోవైపు ఈ నెల 25 లోపు E-KYC కి అవకాశం కల్పించారు.