News November 12, 2024
నెల్లూరు: అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు
అత్యాచారం ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతోపాటూ రూ. 23వేల జరిమానా పడినట్లు చిల్లకూరు SI సురేశ్ బాబు తెలిపారు. మండల పరధిలోని ఓ గ్రామంలో 2021లో ఓ మైనర్ బాలికను కావూరు మస్తాన్ బాబు అపహరించి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు మంగళవారం నిందితుడికి శిక్ష ఖారారు చేసినట్లు SI తెలిపారు.
Similar News
News November 15, 2024
నెల్లూరు: ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియపై కలెక్టర్ చర్చ
నెల్లూరు జిల్లాలో అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News November 15, 2024
వెల్ఫేర్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో విధులు నిర్వర్తించే 11మంది వెల్ఫేర్ అసిస్టెంట్లకు గురువారం షోకాజ్ నోటీసులు అందజేసినట్లు ఎంపీడీవో వేణుగోపాలరావు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబించడంతో నోటీసులు అందజేయడం జరిగిందన్నారు. అలాంటివారు మూడు రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ అందజేయాలని ఆ నోటీసులో సూచించారు.
News November 14, 2024
నెల్లూరు: ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు
అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సెల్ ఫోన్లకు హెచ్చరికలు చేసింది. ‘మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయంపొందాలి.అని మెసేజ్ పంపంది. మీకు ఈ మెసేజ్ వచ్చిందా?.