News July 31, 2024

నెల్లూరు: ఆగస్టు 7న ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగం

image

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ ను ఆగస్టు 7వ తేదీన ఉదయం 9.17 గంటలకు ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాల్లో ఉన్నారు. ఈ రాకెట్ ఈఓఎస్ 08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ప్రస్తుతం రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. సమీక్షల అనంతరం ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

Similar News

News September 16, 2025

నెల్లూరు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతుల ఇబ్బందులు!

image

జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. కోతలు మొదలైపోయినా ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మద్దతు ధర పుట్టి రూ.20,187 ఉండగా మిల్లర్లు రూ.13–15 వేలకే కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు పంటను దెబ్బతీయగా ధరలు పడిపోతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. గతంలో పుట్టి రూ.24 వేలు ఉండగా, ఇప్పుడు దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నామని రైతులు వాపోతున్నారు.

News September 16, 2025

నెల్లూరు: సాగు నీరు ముందుకెళ్లేది ఎలా?

image

అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రధాన ఆయకట్టు పంట కాలువల్లో గుర్రపు డెక్క పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో సాగు నీటికి ఆటంకంగా మారుతోంది. దీంతో సీజన్లో ఆయకట్టు పొలాలకు నీరు అందడం లేదు. జాఫర్ సాహెబ్ కాలువ, సర్వేపల్లి కెనాల్, కనుపూరు కెనాల్ పంట కాలువల్లో రబీ ఆరంభానికి ముందే పూడికతీత పనులు చేపట్టాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు.

News September 16, 2025

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నడం హాస్యాస్పదం : మంత్రి ఆనం

image

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అనడం హాస్యాస్పదమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. 11 మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా ఏం చేయదలచుకున్నారనీ ఆత్మకూరులో మంగళవారం ఆయన ప్రశ్నించారు. 11 నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు మీకు పట్టవా? సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలన్న ఆలోచన లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అమలు చేస్తున్నామని వివరించారు.