News July 31, 2024

నెల్లూరు: ఆగస్టు 7న ఎస్ఎస్ఎల్వీ డీ3 ప్రయోగం

image

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఎస్ఎస్ఎల్వీ డీ3 రాకెట్ ను ఆగస్టు 7వ తేదీన ఉదయం 9.17 గంటలకు ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాల్లో ఉన్నారు. ఈ రాకెట్ ఈఓఎస్ 08 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లనుంది. ప్రస్తుతం రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. సమీక్షల అనంతరం ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

Similar News

News July 6, 2025

నేటి నుంచే రొట్టెల పండుగ.. షెడ్యూల్ ఇదే.!

image

➠ జులై 6వ తేదీ రాత్రి సందల్ మాలి
➠ 7వ తేదీ రాత్రి గంధం మహాత్సవం
➠ 8వ తేదీ రొట్టెల పండుగ
➠ 9వ తేదీ తహలీల్ ఫాతేహ
➠ 10వ తేదీ ముగింపు వేడుకలు
ఈ మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు నెల్లూరుకు తరలి వస్తున్నారు.

News July 5, 2025

రొట్టెల పండుగకు 1,700 మంది పోలీసు సిబ్బంది: IG

image

రొట్టెల పండుగను పటిష్ట బందోబస్త్ నడుమ ప్రశాంతంగా నిర్వహహించడమే లక్ష్యమని IG సర్వశ్రేష్ట త్రిపాఠి తెలిపారు. శనివారం ఆయన రొట్టెల పండుగ బందోబస్త్ ఏర్పాట్లను ఎస్పీ కృష్ణకాంత్‌తో కలసి నిర్వహించారు. పోలీసు సిబ్బంది మానవతాదృక్పదంతో వ్యహరించి విధులు నిర్వహించాలని సూచించారు. 1,700 మంది పోలీసు ఫోర్స్‌తో సర్వం సన్నద్ధం చేశామని తెలిపారు. రొట్టెల పండుగలో వాహనాల పార్కింగ్ అనేది కీలకం అని చెప్పారు.‌

News July 5, 2025

నెల్లూరు: చిన్నారుల కోరిక.. స్పందించిన లోకేశ్

image

నెల్లూరు VR స్కూల్ వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తామూ చదువుకుంటామని కమిషనర్‌ను కోరిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేశ్ ‘X’ వేదికగా స్పందించారు. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. ‘పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక సాధనం విద్య. చిన్నారులు కలలను సాకారం చేసుకునేందుకు అన్ని విధాల అండగా నిలుస్తాం’ అని ఆయన వెల్లడించారు.