News June 21, 2024

నెల్లూరు: ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరు, రంగాచార్యుల కండ్రిగ మధ్యలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ముత్తుకూరుకి వెళ్తున్న ఆటోని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటోలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Similar News

News October 31, 2025

శిర్డీలో వేమిరెడ్డి దంపతులు

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు శిర్డీకి వెళ్లారు. బాబాను శుక్రవారం దర్శించుకున్నారు. సాయినాథుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.

News October 31, 2025

కండలేరుకు నిధులు ఇవ్వాలని వినతి

image

కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్‌కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అంందజేశారు.

News October 31, 2025

నెల్లూరు జిల్లాలోని ఇళ్లపై విచారణ: మంత్రి

image

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం నాసిరకం ఇళ్లను కట్టిందని గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నెల్లూరులోని టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. ఓ కాంట్రాక్ట్ సంస్థ ఈ ఇళ్లను నిర్మించిందన్నారు. వారిపై విజిలెన్స్ విచారణ చేయిస్తామని.. నగదు రికవరీ చేయడమా? క్రిమినల్ కేసులు పెట్టడమా? అనేది త్వరలో చెబుతామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తామన్నారు.