News June 21, 2024

నెల్లూరు: ఆటోని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

image

నెల్లూరు రూరల్ మండలం మాదరాజగూడూరు, రంగాచార్యుల కండ్రిగ మధ్యలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి ముత్తుకూరుకి వెళ్తున్న ఆటోని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆటో పొలాల్లో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆటోలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Similar News

News February 18, 2026

నెల్లూరు: ఇలా చేస్తే రూ.5వేలు!

image

నెల్లూరు జిల్లాలో మై భారత్ యువ వాలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఆకుల మహేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన 10 ఉత్తీర్ణులై 2025 ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండి 29 ఏళ్లు లోపు వారు అర్హులన్నారు. రూ. 5వేలు గౌరవ వేతనం ఉంటుందన్నారు. ఈనెల 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

News February 18, 2026

నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

image

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. నూతన రిజిస్ట్రార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

News February 18, 2026

నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

image

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.