News December 30, 2024
నెల్లూరు: ఆనాటి గ్రీటింగ్ కార్డ్స్ ఇప్పుడు ఎక్కడ..?

నెల్లూరు జిల్లాలో కొత్త సంవత్సరం అంటే అందరూ జొన్నవాడ, నరసింహకొండ, పెంచలకోన అంటూ తమకు నచ్చిన గుడికి వెళ్తుంటారు. ఆ తర్వాత ఆత్మీయుల కోసం గ్రీటింగ్ కార్డు కొనుగోలు చేసి మనసులోని భావాలను ఆ కార్డుపై రాసి పంపేవారు. నేడు పరిస్థితి మారింది. గుడికి వెళ్లడం కొనసాగుతున్నా.. గ్రీటింగ్ కార్డులు మాయమయ్యాయి. మొబైల్ ఫోన్ల రాకతో అర్ధరాత్రి 12 మోగగానే మెసేజ్లు, కాల్స్తో విషెస్ చెబుతున్నారు.
Similar News
News December 1, 2025
గూడూరులో దారుణం

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
News December 1, 2025
నెల్లూరు: కుమారుడిని చంపిన తండ్రి

ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం జరిగింది. స్థానిక దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ ఉదయం పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య(33) తన తండ్రితో గొడవకు దిగాడు. ఈక్రమంలో తన చేతిలోని కర్రతో పుల్లయ్య కుమారుడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మస్తానయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
News December 1, 2025
నెల్లూరు నిమ్మకు తగ్గిన డిమాండ్

నిమ్మకు డిమాండ్ తగ్గిపోయింది. పొదలకూరు నుంచి ఉత్తరాది ప్రాంతాలకు నిమ్మ ఎగుమతి అవుతుంటుంది. అక్కడ అవసరాలు తగ్గిపోవడంతో నిమ్మకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది. బస్తా రూ.300 నుంచి రూ.600 పలుకుతుండటంతో రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలోకు పది రూపాయలు కూడా లభించడం లేదు. పొదలకూరు మండల వ్యాప్తంగా 5వేల ఎకరాలలో నిమ్మ సాగు అవుతుండగా.. దీని మీద సుమారు 2వేల మంది రైతులు ఆధారపడి ఉన్నారు.


