News April 24, 2024
నెల్లూరు: ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఆస్తుల విలువ రూ. 22 లక్షలు

నెల్లూరు నగర నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.డీ ఖలీల్ అహ్మద్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 22.18 లక్షలు ఉన్నట్లు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఖలీల్ పేరుపై రూ.16.25 లక్షలు, ఆయన సతీమణి పేరుపై రూ. 4.26 లక్షలు, కుమారుడి పేరున రూ. 1.67 లక్షల చరాస్తులు ఉన్నట్లు చూపించారు. అప్పులు, కేసులు లేవు.
Similar News
News February 12, 2026
నెల్లూరులో పరీక్ష ఫీజులు ఇలా..!

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెగ్యులర్ విద్యార్థులు 2023-25, 2024-26లో ఒకసారి ఫెయిలైన వారు పరీక్ష ఫీజును ఈనెల 17వ తేదీ లోపు చెల్లించాలని నెల్లూరు డీఈవో బాలాజీరావు కోరారు. రూ.50 అపరాధ రుసుముతో 24 వరకు అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140, రెండింటికి రూ.120, ఒకదానికి రూ.100 చెల్లించాలని సూచించారు.
News February 12, 2026
నెల్లూరు కలెక్టరా.. మజాకా!

నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా మరోసారి తనదైన మార్క్ చూపించారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ అనే సంస్థ ప్రకాశం జిల్లాలో రూ.500 కోట్లతో ఏరో స్పేస్ పరిశ్రమ పెట్టాలని నిర్ణయించింది. అక్కడ భూమి, ఇతర అనుమతులకు సంస్థ ప్రయత్నించినా అధికారులు స్పందించలేదు. వెంటనే నెల్లూరు కలెక్టర్ ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వారం రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో దుత్తలూరు మండలంలో ఈ భారీ పరిశ్రమను నెలకొల్పనున్నారు.
News February 12, 2026
18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు

NLR: డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్లకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈనెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు ఓ ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను www.bse.ap.gov.inలో అందుబాటులో ఉంచామన్నారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పక తీసుకు రావాలని కోరారు.


