News May 8, 2024

నెల్లూరు: ఆ గ్రామం అందరికీ ఆదర్శం

image

ఎన్నికల వేళ నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ గ్రామంలో మద్యం, నగదు పంపిణీకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. స్వచ్ఛందంగా అందరం ఓటేస్తామని చెబుతున్నారు. ఈ మేరకు ప్రతి ఇంటి ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘రాజ్యాంగాన్ని మార్చాలని భావించే పార్టీ అభ్యర్థులు, ఓట్లు కొనాలనుకునేవారు మా ఇంటికి రానవసరం లేదు’ అని బ్యానర్లపై రాశారు.

Similar News

News September 30, 2024

నెల్లూరులో రైలు ఢీకొని మహిళ మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి గూడ్స్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 29, 2024

గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు

image

గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.