News July 11, 2024
నెల్లూరు: ఆ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు

నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తుల సౌకర్యం మేరకు ఆర్టీసి బస్సులు తిప్పనున్నట్లు ఆర్ఎం విజయరత్నం తెలిపారు. జిల్లా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుంచి దర్గా వరకు 44 ప్రత్యేక బస్సులను తిప్పనున్నట్లు ఆర్ఎం చెప్పారు. ఈ బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తామని ప్రకటించారు.
Similar News
News January 3, 2026
నెల్లూరు కలెక్టర్ వినూత్న నిర్ణయం

కొత్త సంవత్సరం వేళ బొకేలు, స్వీట్లకు బదులు విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఇవ్వాలన్న కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునకు మంచి స్పందన లభించింది. సందర్శకులు ఇచ్చిన వాషింగ్ మెషిన్ను కలెక్టర్ శనివారం బీసీ బాలికల హాస్టల్కు పంపారు. అలాగే కావలి, ఆత్మకూరు హాస్టళ్లకు నోట్ పుస్తకాలు, డిక్షనరీలను పంపిణీ చేశారు. విద్యార్థులపై కలెక్టర్ చూపుతున్న ఈ ప్రత్యేక శ్రద్ధ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News January 3, 2026
నెల్లూరు: చిన్నారి మృతదేహాన్ని లాక్కొచ్చిన కుక్కలు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చిన్నారి <<18745357>>మృతదేహం <<>>శుక్రవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎస్ఐ నాగార్జున రెడ్డి విచారణ చేపట్టి అసలు విషయాలు వెల్లడించారు. రావురు డొంక గిరిజన కాలనీకి చెందిన వెలుగు జానయ్య 5నెలల కుమారుడు గత నెల 26న అనారోగ్యంతో చనిపోయాడు. మృతదేహాన్ని జగనన్న కాలనీ సమీపంలో తక్కువ లోతు గుంత తీసి పూడ్చారు. కుక్కలు మట్టి తవ్వి మృతదేహాన్ని బయటకు లాక్కొచ్చాయని ఎస్ఐ విచారణలో తేలింది.
News January 3, 2026
నెల్లూరు జిల్లాలో 19 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలోని KGBVలో 19 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో కోరారు. శనివారం నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు.


